|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 04:32 PM
వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని తాత్కాలికంగా 'సూర్య 46' అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని మేకర్స్ పూర్తి చేసారు. తాజాగా ఇప్పుడు ఈరోజు నటుడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాలో సూర్యకి జోడిగా మమిత బైజు నటిస్తుంది. ఈ చిత్రానికి GV ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్యదేవర నాగా వంశి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలతో పాటు సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News