|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:25 PM
'హరి హర వీరమల్లు' చిత్రానికి ఏపీలో ఇప్పటికే పది రోజుల పాటు ఈ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణలో సోమవారం సాయంత్రం వరకూ ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. ఇలాంటి టైమ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ నేత రోహిన్ రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. ఎ. ఎం. రత్నం రిక్వెస్ట్ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కన్వెన్స్ చేసి 'హరిహర వీరమల్లు' టిక్కెట్ రేట్లు తెలంగాణలో సైతం పెంచుకొనేలా చేశారని అంటున్నారు. అంతేకాదు... ఇక్కడ కూడా పెయిడ్ ప్రీమియర్ షోస్ కు పర్మిషన్ ఇప్పించారట. ఈ విషయంలో రోహిన్ రెడ్డి సాయం మరివలేమంటూ ఎ. ఎం. రత్నం స్వయంగా సోమవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.
Latest News