|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:09 PM
ఈ మధ్యకాలంలో ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే పబ్లిక్ టాక్ అనేది చాలా ముఖ్యం. మొదటి షో చూడగానే రివ్యూయర్స్ సినిమా హిట్టా.. ఫట్టా అని చెప్పేస్తున్నారు. ఇలాంటివాటికి సపరేట్ యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అందులో సినిమా మొత్తాన్ని క్లుప్తంగా వివరించి, రేటింగ్ ఇచ్చి.. చూడొచ్చా.. చూడకూడదా.. ? అనేది తేల్చి చెప్పేస్తారు. ఇక చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇలాంటి రివ్యూయర్స్ ఇచ్చిన నెగిటివ్ రివ్యూల వలనే పరాజయాలను అందుకున్నాయి.తాజాగా ఈ రివ్యూయర్స్ గురించి నాగ వంశీ మాట్లాడాడు. మంచు విష్ణు వలన ఇలాంటి హ్యాండిల్స్ చాలా తగ్గాయని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ' మొన్న విష్ణు అన్న ఏం చేశాడో కానీ, తగ్గాయి. వాళ్ళందరి మీద విష్ణు అన్న మాములుగా ఆడలేదు. యూట్యూబ్ లు కానీ, ఇన్స్టాగ్రామ్ లు కానీ.. షేక్ రెండు రోజులు. ఆయన ఏం చేశాడో ఎవరికి తెలియదు. సినిమా పేరు కూడా ఎత్తలేదు. అంత భయపెట్టాడు. కొన్ని హ్యాండిల్స్ ఫలానా సినిమా అని టైటిల్ చెప్పి చెప్పడానికి కూడా భయపడ్డారు. ఆయన ఏదో చేసి కంట్రోల్ చేశాడు. సినిమా నచ్చినవాళ్లు కాదు.. నచ్చనివాళ్లు కూడా చాలా బాలెన్సుడ్ గా.. ఫిల్టర్ చేసి చెప్పారు' అని చెప్పుకొచ్చాడు. కన్నప్పను ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా పడలేదని నాగ వంశీ చెప్పుకొచ్చాడు.
Latest News