|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:55 AM
సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు. ప్రజలకు ఏది మంచి, ఏది చెడు అని చెప్పాల్సిన సామాజిక బాధ్యత కూడా సినిమా మీద ఉంటుంది. అప్పుడే ఆ కళకు సార్థకత చేకూరుతుంది. అయితే సినిమా విఫణి వీధిలోకి అడుగుపెట్టిన తర్వాత అది కూడా ఓ వ్యాపార వస్తువుగా మారిపోయింది. సినిమా ద్వారా వచ్చే లాభాల మీదనే నిర్మాతలు దృష్టి పెడుతున్నారు తప్పితే... ఫక్తు వాణిజ్య చిత్రాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. ఇలాంటి రోజుల్లో కూడా కొన్ని సెన్సిబుల్ మూవీస్ వివిధ భారతీయ భాషల్లో వస్తున్నాయి. అలా మలయాళంలో రూపుదిద్దుకున్నదే 'ఈ వలయం'. ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లలో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని, త్వరలోనే ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తామని నిర్మాత జోబీ జాయ్ తెలిపారు.
Latest News