|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 10:24 AM
ఫిష్ వెంకట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరుగాంచిన నటుడు. అతను ఎక్కువగా తెలంగాణ యాసలో హాస్య, ప్రతినాయక పాత్రలు పోషించాడు. వి.వి.వినాయక్ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 'ఆది' సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుమారు 90 సినిమాల్లో నటించాడు. అతని చివరి సినిమా 'కాఫీ విత్ కిల్లర్', ఇది ఆహా ఓటీటీలో విడుదలైంది. కాగా, ఆయన శుక్రవారం రాత్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన్ను దర్శకుడు వి.వి.వినాయక్ తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వి.వి.వినాయక్ ని సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. ఇతడు ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు. ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు 90 సినిమాల్లో నటించాడు. కాగా, ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
Latest News