|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 12:08 PM
తెలుగు సినిమా ప్రపంచంలో సౌందర్య ఒక మణిదీపం. ఆమె అందం, అభినయం, మంచి మనసు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమ్మోరు, పెదరాయుడు, అంతఃపురం వంటి చిత్రాల్లో కుటుంబ విలువలు, సాంప్రదాయం ప్రతిబింబించే పాత్రలతో 'తెలుగింటి ఆడపడుచు'గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి ఏడాది జులై 18న సౌందర్య జయంతిగా అభిమానులు ఆమెను ఘనంగా స్మరిస్తుంటారు.
ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేసిన సౌందర్య..
ఆ తర్వాత కన్నడ, తమిళ్, మలయాళం చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటించింది. హిందీలో అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘సూర్యవంశ్’ అనే సినిమాలో నటించింది. ఇక తెలుగులో ఎక్కువగా వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది సౌందర్య. వెంకటేష్ తో రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, దేవీపుత్రుడు ఇలా పలు చిత్రాలలో నటించి బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు సొంతం చేసుకుంది.