|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 10:39 AM
ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా ఇవాళ మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 1980లో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, 1989లో నాలైయ మనితన్ సినిమాతో దర్శకుడిగా మారారు. కడవుల్, పురచ్చికారన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్, కాడవర్, గజానా చిత్రాల్లో నటించారు.
Latest News