![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 08:23 PM
ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోతుండగా, సెలబ్రిటీలు కూడా వీటికి బలవుతున్నారు. తాజాగా యాంకర్, నటి అనసూయ ఆన్‌లైన్ మోసానికి గురయ్యారు. ట్రఫుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్‌సైట్‌లో దుస్తులు ఆర్డర్ చేసిన అనసూయ ముందస్తుగా డబ్బులు చెల్లించింది. అయితే వస్తువులు రాకపోవడంతో పాటు, డబ్బులు కూడా రిఫండ్ కాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Latest News