![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 12:47 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈచిత్రం జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది."హిందువుగా జీవించాలంటే పన్ను చెల్లించాల్సిన సమయం..ఈ దేశ శ్రమ ముస్లిం బాద్‌షా పాదాల క్రింద నలిగిపోతున్న కాలం.. ఒక వీరుడు కోసం పకృతి పురుడు పోసుకుంటున్న సమయం.." వంటి డైలాగులతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.ఈవిజువల్స్ చూస్తే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యంలో, ముఖ్యంగా ఔరంగజేబు పాలనలో జరిగే కథాంశాన్ని ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది.పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే ధైర్యసాహసాలు గల యోధుడిగా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News