![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:32 PM
బాలీవుడ్ నటి ఈషా గుప్తా, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకున్న బంధంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరదించారు. గతంలో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ ఇంటర్వ్యూలో ఈషా గుప్తా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు. హార్దిక్ పాండ్యాతో తనకున్న సంబంధం గురించి ఈషా మాట్లాడుతూ, "అవును, కొంతకాలం మేమిద్దరం మాట్లాడుకున్నాం. కానీ మేం డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోవడం లేదు. కొన్ని నెలల పాటు మా మధ్య సంభాషణలు జరిగాయి. బహుశా ఇది జరుగుతుందేమో, జరగదేమో అన్న దశలో ఉండేవాళ్లం. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయింది. కాబట్టి దాన్ని డేటింగ్ అని చెప్పలేం. ఒకట్రెండు సార్లు కలిశాం, అంతే. నేను చెప్పినట్లుగా, కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అది ఆగిపోయింది" అని వివరించారు.
Latest News