![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:49 PM
మలయాళంలో గత నెల థియేటర్లలో రిలీజైన రొమాంటిక్ ఫాంటసీ చిత్రం 'లవ్లీ'. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. 'లవ్లీ' నిర్మాతలు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం ఈగ చిత్ర బృందం మధ్య కాపీరైట్ వివాదం చెలరేగింది. తెలుగులో తీసిన 'ఈగ'నే మలయాళ చిత్రంలోనూ అలాగే వాడుకున్నారని ఆరోపణలు చేశారు. గత నెల 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 3డీలోనూ సినిమా రిలీజ్ అయింది. ఆ వెర్షన్ చిత్రీకరణ చాలా బాగుందన్న ప్రశంసలు వస్తున్నాయి. కథలో బలం లేకపోవడంతో సినిమా బోల్తా కొట్టింది. తెలుగులో రిలీజ్ చేస్తే అక్కడా పెద్దగా ఆదరణ దక్కలేదు.ఓటీటీలో మాత్రం మలయాళ వెర్షన్ అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా రివ్యూల కంటే కాపీరైట్ వివాదంతోనే ఎక్కువ పాపులర్ అయింది. 2012లో రాజమౌళి తీసిన ఈగ మూవీ మేకర్స్.. ఈ సినిమా మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమాలో చూపించిన ఈగ గ్రాఫిక్స్ తెలుగులో వచ్చిన ఈగ సినిమా కాపీ అని సాయి కొర్రపాటి ఆరోపించారు. ఈ విషయం కోర్టు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దర్శకుడు దిలీష్ నాయర్ మాత్రం కాపీరైట్ ఆరోపణలను ఖండిస్తున్నాడు. దీనిని నిరూపించడానికి తన దగ్గర టెక్నికల్ ఆధారం కూడా ఉందని చెబుతున్నాడు. మాథ్యూ థామస్, శివాంగి కృష్ణకుమార్, మనోజ్ కే జయన్ కీలక పాత్రలు పోషించారు. అనుకోకుండా జైలుకు వెళ్లిన ఓ యువకుడికి అక్కడ మాట్లాడే ఈగ పరిచయం అవుతుంది. వీళ్ల మధ్య బంధం ఎలా బలపడిందనేది ఈ సినిమా కథ. ఇందులోని ఈగను చూస్తే రాజమౌళి తీసిన ఈగ సినిమాలో ఈగ గుర్తొస్తుంది. దీంతో ఆ గ్రాఫిక్స్‌ను కాపీ చేశారనే ఆరోపణలను మేకర్స్ ఎదుర్కొంటున్నారు.
Latest News