|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:51 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు. త్రిష కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆ తరువాత ఏమైందో ఏమో దానిని క్యాన్సిల్ చేసుకొని సింగిల్ గా జీవిస్తుంది. కుర్ర హీరోయిన్లతో పాటు ధీటుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది ఈమధ్యకాలంలో ఎక్కువ విజయ్ పక్కనే కనిపిస్తుంది.విజయ్ సైతం త్రిషతో రిలేషన్ లో ఉన్నాడని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. విజయ్ భార్య సంగీత.. కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుందని, వారిద్దరూ ఇప్పుడు కలిసి ఒకే ఇంట్లో ఉండడం లేదని సమాచారం. ఎప్పటినుంచో వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, దానికి కారణం త్రిష అని కూడా చెప్పుకొస్తున్నారు. విజయ్ - సంగీత విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని, విజయ్ రాజకీయ భవిష్యత్తు పాడవకుండా ఉండడానికి కొన్నాళ్లు ఈ విడాకుల విషయాన్నీ పక్కన పెట్టినట్లు కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఇందులో నిజం లేదు కేవలం పుకారు మాత్రమే అని అనుకున్న ప్రతిసారి.. త్రిష వీరి రిలేషన్ కన్ఫర్మ్ చేసే విధంగా ఒక ఫోటోను షేర్ చేయడం. మళ్లీ ఆ రూమర్స్ మొదటికి రావడం జరుగుతున్నాయి.గతేడాది త్రిష.. విజయ్ బర్త్ డేకు ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేసి విషెస్ తెలిపింది. లిఫ్ట్ లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కావడం, అందులోనూ విజయ్ లియో సినిమా గెటప్ లో ఉండడంతో.. వారిద్దరూ సినిమా సెట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో అయినప్పటికీ పుకార్లు షికార్లు చేశాయి. ఈ జంట షూటింగ్ వదిలి బయట ఎంజాయ్ చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టుకొచ్చారు. కొన్నిరోజులు ఈ జంట గురించే చర్చ నడిచింది. ఆ తరువాత విజయ్ రాజకీయ పనుల్లో బిజీగా మారాడు. అదే సమయంలో ది గోట్ సినిమాలో త్రిష ఐటెంసాంగ్ చేయడంతో మరోసారి రిలేషన్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ది గోట్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా రిలీజ్ సమయంలో కొద్దిగా హడావిడి చేసినా ఆ తరువాత నెమ్మదిగా అందరూ మర్చిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి త్రిష.. తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా విజయ్ బర్త్ డే కి త్రిష వెరీ స్పెషల్ గా విష్ చేసింది. విజయ్ తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో చాలా రీసెంట్ గా దిగినట్లు తెలుస్తోంది. విజయ్, త్రిష ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్లను ఎత్తుకొని ముద్దు చేస్తుండగా.. వారిద్దరినీ చూస్తూ అమ్మడు మురిసిపోతూ కనిపించింది. ఇక ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Latest News