|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:53 AM
ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేసి, అంతర్జాతీయ స్థాయిలో మన సత్తాను చాటేందుకు రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మూవీ చేస్తున్నాడు. దీనితో పాటే అతను 'రామాయణ్' చిత్రంలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా 'టాక్సిక్' మూవీ దర్శకురాలు గీతు మోహన్ దాస్ కు యశ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దాంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడిందని, అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాదని... ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాలపై చిత్ర నిర్మాతలు వెంకట్ కె నారాయణ, యశ్ స్పందించలేదు. తాజాగా ఈ సినిమా మరో వంద రోజుల్లో ముందు అనుకున్న విధంగా మార్చి 19న విడుదల కాబోతోందని ఓ పోస్టర్ ద్వారా తెలియచేశారు. దాంతో విమర్శకుల నోటికి సైలెంట్ గా వీరు తాళం వేసినట్టయ్యింది.
Latest News