|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:13 AM
భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కలిసి నటించిన యాడ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీమా రంగంలో ప్రముఖ సంస్థ తమ కొత్త ప్రచారంలో భాగంగా ఈ ఇద్దరని ఒకే వేదికపైకి తీసుకురావడం విశేషం. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ యాడ్ లో భాగంగా 'భరోసా తుమ్' అనే థీమ్‌ను ఎంచుకుంది. ఈ యాడ్‌లో రోహిత్ శర్మ తన భార్య రితికా సజ్దేహ్ తో కలిసి ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇప్పుడు వారికి అల్లు శిరీష్ కూడా తోడయ్యారు. దక్షిణాది మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త తరం ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేందుకు అల్లు శిరీష్‌ను ఈ ప్రచారంలో చేర్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ యాడ్ ఫిల్మ్ ద్వారా కుటుంబ భద్రత, నమ్మకం అనే అంశాలపై ప్రధానంగా సందేశాన్ని అందించారు. ఈ యాడ్‌లో శిరీష్ పాత్ర కూడా కుటుంబ విలువలు, భరోసాను ప్రతిబింబిస్తుంది.
Latest News