|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:39 PM
తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో తన మధురమైన గాత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందిన గీతా మాధురి, ఎన్నో సెన్సేషనల్ సాంగ్స్ పాడి ఫ్యాన్స్‌కి ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకుంది.ఇంటర్వ్యూలో గీతామాధురి తన ప్రపోజల్ సీక్రెట్‌ను పంచుకుంది. నిజానికి, ఆమె ముందుగా ప్రేమించిన వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేసినట్లు ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ వ్యక్తి కూడా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో.టాలీవుడ్‌లో సింగర్ గీతా మాధురి-హీరో నందు జంట గురించి అందరికి తెలుసు. గీతా ఒక ఇంటర్వ్యూలో, నందుకు ఎలా ప్రేమప్రకటన (లవ్ ప్రపోజల్) ఇచ్చిందో వివరించింది. వారి పరిచయం మొదట ఫ్రెండ్స్‌గా ప్రారంభమైందని, ఆ తర్వాత తనే నందుకు ముందుగా ప్రపోజ్ చేసినట్లు వెల్లడించింది. గీతా చెప్పడం ప్రకారం, ప్రపోజ్ అంటే కేవలం “I love you” మాత్రమే కాదని, మన ఇద్దరి మైండ్‌సెట్ మ్యాచ్ అవుతుందని నమ్మించాలని తెలిపారు. ఆ తర్వాత తమ స్నేహం మెల్లగా ప్రేమలోకి మారి, “నువ్వు” అనే స్టేజీకి, తరువాత “కొద్దిగా ఒసేయ్, ఒరెయ్” వరకు వెళ్లిందని, చివరికి వివాహానికి దారితీసిందని చెప్పింది.ఈ జంట 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ స్టార్ కపుల్‌కు ఒక పాప మరియు బాబు ఉన్నారు. హీరో నందు ఇటీవల తీసిన సినిమా ‘సైక్ సిద్ధార్థ్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గీతా మాధురి టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరిగా కొనసాగుతూ, పలు సింగింగ్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
Latest News