|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 11:33 PM
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాల ఎక్కువగా తేదీలు ప్రకటించబడ్డాయి. వాటిలో మనశంకర్, వరప్రసాద్, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్, భర్త మహాశయులు వంటి సినిమాలకు అధికారిక రిలీజ్ డేట్స్ వెల్లడించబడ్డాయి.తాజాగా, హీరో శర్వానంద్ నటించిన “నారీ నారీ నడుమ మురారి” సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించబడింది. జనవరి 14, 2026న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, అని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ మేకర్స్ తెలిపారు. అయితే, ఈ సినిమా సాయంత్రం 5:49 PMకి రిలీజ్ కానుంది అని ప్రకటించడం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్ డే ఫస్ట్ షో ఉదయం 11 గంటలకు జరుగుతుంటుంది. ఈ సాయంత్రం షో ద్వారా కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుందా అనే చర్చ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.చిత్రంలో సాయూక్త్ మరియు సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించగా, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ, శర్వానంద్ కెరీర్‌లో 37వ చిత్రం అవుతుంది.
Latest News