|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 02:27 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారు. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా, ఆ తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాతే చిరంజీవి తన తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో, 'రాజా సాబ్' దర్శకుడు మారుతి, చిరంజీవితో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మారుతి ఇప్పటికే ఒక కథను సిద్ధం చేసుకున్నారని, మెగాస్టార్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.
Latest News