|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:11 PM
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం నుండి రెగ్యులర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రీమియర్లలోనే సినిమాకు మంచి స్పందన లభించగా అఖండగా బాలయ్య గారి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచాయి.ఇదిలా ఉంటే, అఖండ ఫ్రాంచైజ్ కొనసాగుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా చివర్లోనే మూడో భాగం టైటిల్‌గా "జై అఖండ" ను రివీల్ చేశారు. కథ ప్రకారం, అఖండ 'సంబాలా'కు చేరుకునే దశలో సినిమా ముగుస్తుంది. భారతదేశానికి మరోసారి అవసరం వచ్చినప్పుడు తిరిగి వస్తాడనే సూచనతో ముగింపు ఇచ్చారు.బోయపాటి శ్రీను స్క్రిప్ట్ పూర్తిచేశారా లేదా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, Jai Akhanda మాత్రం ఫ్రాంచైజ్‌లో మూడో చిత్రంగా ఖరారైంది. అఖండ 2లో సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ యాజమాన్యంలో నిర్మితమైన ఈ చిత్రం 2D, 3D ఫార్మాట్లలో విడుదలైంది.నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం నుండి రెగ్యులర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Latest News