|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:52 PM
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రం 'అఖండ 2' భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో సందడి మొదలుపెట్టిన ఈ సినిమా, ఈ రోజు నుంచి రెగ్యులర్ ప్రదర్శనలతో ప్రేక్షకులను పలకరిస్తోంది. మునుపటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.బాలయ్య-బోయపాటి కాంబో నుంచి ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలు, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమాకు పాజిటివ్ టాక్ మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరగడంతో మొదటి రోజు వసూళ్లపై ట్రేడ్ వర్గాలు ఆసక్తికర అంచనాలు వేస్తున్నాయి. ప్రీమియర్‌లు, మొదటి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Latest News