|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:39 PM
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులోనూ తన పని పట్ల చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాను రాత్రంతా పనిచేయడం వల్ల బ్లాగ్‌లో అప్‌డేట్స్ ఇవ్వడంలో ఆలస్యమైందని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు తన టంబ్లర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు."ఉదయం 5:30 గంటల వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాను. దీనివల్ల బ్లాగ్‌లో ముఖ్యమైన అప్‌డేట్స్ ఇవ్వడం, స్పందించడం మర్చిపోయాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను" అని అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
Latest News