|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:16 PM
‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన తరుణ్ భాస్కర్ హీరోయిన్ ఈషా రెబ్బాతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ఈషా రెబ్బాతో కలిసి ఆయన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే మలయాళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమగా చిగురించిందని సినీ వర్గాల టాక్. వరంగల్ ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరి మధ్య ప్రాంతీయ బంధం కూడా వీరిని మరింత దగ్గర చేసిందని చెబుతున్నారు.
Latest News