|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:18 PM
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను.. మోహన్ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ‘అఖండ 2’ చిత్రం గురించి ఆయన మాట్లాడారు. దేశం, ధర్మం, దైవం గొప్పదనాన్ని, సనాతన ధర్మ వైభవాన్ని నేటి తరానికి అద్భుతంగా చూపించారని బోయపాటిని అభినందించారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి విలువలతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.
Latest News