|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 03:12 PM
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మరియు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2: ది రూల్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. పుష్ప 2 బహుళ భారతీయ భాషలలో నెట్‌ఫ్లిక్స్ లో గొప్ప ప్రవేశం చేసింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఇటీవలే టెలికాస్ట్ లో 6.48 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ హిట్ మూవీలో రష్మికా మాండన్న అల్లు అర్జున్ కి జోడిగా నటించారు. ఈ పాన్-ఇండియన్ డ్రామాలో బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాసిల్ క్రూరమైన విలన్ పాత్రను పోషిస్తాడు, సునీల్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, జగదీష్, బ్రహ్మాజీ మరియు రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. థమన్, సామ్ సిఎస్ మరియు ఇతరుల అదనపు సహకారాలతో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించింది.
Latest News