|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 06:30 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన హరిహర వీరమల్లు చిత్రం నేడు థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైదరాబాదులో నిర్వహించగా, పవన్ కల్యాణ్ హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన తన మనోభావాలను పంచుకున్నారు.నేనెప్పుడూ నన్నొక హీరో అనుకోలేదు. కానీ విధి అలా నడిపించింది హీరో అయ్యాను, రాజకీయ నాయకుడ్ని అయ్యాను.హరిహర వీరమల్లు ఏ స్థాయిలో విజయం సాధించిందనేది నాకు తెలియదు. పీరియాడిక్ చిత్రాల్లో వీఎఫ్ఎక్స్ కంటే ఎమోషన్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి.గట్టిగా 200 ఏళ్లు కూడా లేని మొఘలుల చరిత్ర గురించి గొప్పగా చెబుతారు కానీ, మన రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయల గురించి ఎందుకు చెప్పరు.ఔరంగజేబు చేసిన దారుణాలను చరిత్రకారులు దాచిపెట్టారు.హరిహర వీరమల్లు క్లైమాక్స్ సీన్ అందరికీ నచ్చడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ జరుపుకుంది. త్వరగా పూర్తవుతుందని ఆశిస్తున్నా.హరిహర వీరమల్లు చిత్రాన్ని బాయ్ కాట్ చేసే ప్రయత్నాలు జరిగాయి నా సినిమా వాళ్లను అంత భయపెట్టిందా?హిందువుగా ఉంటే జిజియా పన్ను కట్టాలన్న శాసనాన్ని ఎవరూ ప్రశ్నించరేంటి అనుకున్నాను. ఈ చిత్రంలో ఆ పాయింట్ ను లేవనెత్తినెందుకు సంతోషంగా ఉంది.హరిహర వీరమల్లు పార్ట్-1లో ఏవైనా తప్పులు ఉంటే చెప్పండి సెకండ్ పార్ట్ లో సరిదిద్దుకుంటాం.మా సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నారంటే మేం బలమైన వాళ్లమనే అర్థం.నేను ఏ స్థాయికి ఎదిగానో నాకు తెలియదుbనాకు తెలిసిందల్లా ధైర్యంగా ఉండడమే.నేను ఎప్పుడూ డిప్రెషన్ కు లోనవ్వను. విజయం కంటే ఎలాగోలా బతకడమే ముఖ్యం అనుకుంటాను.
Latest News