|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 08:17 PM
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో శ్రీ బాల ఆసుపత్రిలోని రిసెప్షనిస్ట్‌పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన ఘటనపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని ఎప్పటికీ క్షమించకూడదని, అతడిని జైలుకు పంపించాలని అన్నారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.‘‘ఇలాంటి ప్రవర్తన సరైందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? అవతలి వ్యక్తిపై ఎలా చేయి ఎత్తగలుగుతారు? మానవత్వం లేకుండా చేసిన ఈ పనిపై కనీసం పశ్చాత్తాపం, అపరాధభావం ఉండదా? ఇలాంటి మీ ప్రవర్తన చూసి ఎవరైనా మీతో కలిసి ఉండాలనుకుంటారా? ఇది చాలా అవమానకర చర్య. ఇలాంటి ప్రవర్తనను మనం ఎన్నటికీ క్షమించకూడదు. ఈ ఘటనను ఖండించి అతడిని శిక్షించకపోతే అది మనకే సిగ్గుచేటు. ఈ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే’’ అని జాన్వీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Latest News