|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 04:49 PM
భారతదేశంలో ‘మీటూ’ ఉద్యమానికి బాటలు వేసిన బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా తన సొంత ఇంట్లోనే గత ఆరేళ్లుగా వేధింపులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె కన్నీటి పర్యంతమవుతూ వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ భావోద్వేగ వీడియోలో ఆమె సాయం కోసం వేడుకున్నారు. త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. "నేను ఈ వేధింపులతో విసిగిపోయాను! ఇది 2018 నుంచి కొనసాగుతోంది. నాకు సాయం చేయాలని పోలీసులను కోరాను. ఎవరైనా నాకు సహాయం చేయండి!" అని ఆమె తన వీడియో క్యాప్షన్‌లో రాసుకున్నారు.వీడియోలో తనుశ్రీ దత్తా ఆవేదనతో మాట్లాడుతూ "నా సొంత ఇంట్లో నన్ను వేధిస్తున్నారు. నేను పోలీసులకు కాల్ చేశాను. వారు నన్ను స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా నన్ను తీవ్రంగా వేధించారు" అని విలపించారు. తన ఆరోగ్యం క్షీణించిందని వివరించారు. "నా ఇంట్లో పనిమనిషిని కూడా పెట్టుకోలేను. కొందరు పనిమనిషిలా వచ్చి నా వస్తువులు దొంగిలించారు. నేనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది" అని ఆమె తన కష్టాలను వెల్లడించారు. ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారు.
Latest News