|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 10:52 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తన పాత్ర అయిన "హరిహర వీరమల్లు" గురించి గాఢమైన భావోద్వేగంతో చెప్పారు. "ధర్మం కోసం నిలబడే విల్లు హరిహర వీరమల్లు," అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సినిమా పాత్ర మాత్రమే కాదు, నిజ జీవితంలోను ధర్మం కోసం పోరాడే వ్యక్తుల ప్రతిరూపంగా హరిహర వీరమల్లు పాత్రను తీర్చిదిద్దారని వివరించారు."నన్ను విశాఖ లో ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు ను అరెస్టు చేయడం వంటి ఘటనలతో అప్పుడు షూటింగ్ ఆలస్యం అయింది. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్కవుట్ చేశాం. ఇందులో రాజకీయ అంశాలు లేవు.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మాత్రమే. సినిమానా, రాజకీయాలా అంటే నా ప్రయారిటీ రాజకీయాలకే. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాను. రెమ్యూనరేషన్ గురించి ఆలోచన చేయలేదు. సినిమా పూర్తి చేయాలనే పని చేశాను" అని పవన్ కల్యాణ్ తెలిపారు."గత ప్రభుత్వం సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు రావడం నా కోసం చాలా గొప్ప అనుభవంగా ఉంది. ప్రతి చిన్న పనికీ ఒక చిన్న యుద్ధం చేయాల్సి వసదు. జీవితం లో సంఘర్షణ ఒక భాగమే. మా కథ మచిలీపట్నం నుండి మొదలై హైదరాబాద్, ఢిల్లీ వరకు సాగుతుంది. ఇది ఊహాజనిత కథే అయినా చారిత్రక నేపథ్యం మీద ఆధారపడి ఉంది. ఆ రోజుల్లో టిక్కెట్ తగ్గించిన సంగతి కూడా గుర్తుంది. ఈ ప్రభుత్వం పెంచే అవకాశాలు ఇచ్చింది. ఈ విషయం నా చేతిలో లేదని చెప్పాలి, ఇలా జరిగింది అంతే. నా నిర్మాతలతోపాటు నేను కూడా నష్టపోయాను. రాజకీయాల్లో ఉన్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడతాను. నేను ఎప్పుడు సినిమాల విజయోత్సవాల్లో పాల్గొనను. కానీ మా కూటమి ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తాం" అని పవన్ కల్యాణ్ తెలిపారు."సినిమా గ్లామర్ తో నిండిపోయినట్టే కనిపిస్తుంది... కానీ జానీ దర్శకత్వంలో నిజంగా కాస్త ఇబ్బంది పడిపోయాను. డిస్టిబ్యూటర్లు మా ఇంటికి వచ్చారు. లాభాలు వచ్చినా నాకు అదనంగా డబ్బులు రాదు అని అనిపించింది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక ఇబ్బందులుగా భావించటం నాకు దుఃఖం కలిగించింది. ఆ అనుభవం నాకు బలాన్ని ఇచ్చింది. 2019 ఎన్నికలలో ఓడినప్పటికీ ఆ అనుభవంతోనే నిలబడ్డాను. ఒకసారి నష్టం వచ్చినపుడు ఇలా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అన్న నమ్మకం కూడా వచ్చింది. ఎఎం రత్నం వంటి నిర్మాత చాలా కష్టపడి ఈ సినిమాను నిర్మించారు. ఆయనకు అన్ని విధాలా అండగా ఉండాలని నేను నేడు నిశ్చయించుకున్నాను. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని నేను స్వయంగా డైరెక్ట్ చేశాను. నిర్మాత కష్టానికి సంబంధించిన రెమ్యూనరేషన్ కూడా ఇప్పటివరకు తీసుకోలేదు. సినిమా విజయవంతమైన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నాను. పార్ట్ 2కి ఇరవై శాతం షూటింగ్ పూర్తిచేశాం. సినిమా పరిశ్రమ ఎక్కడ ఉన్నా సరే, కానీ ఏపీ లో షూటింగ్ కి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఫిల్మ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు కూడా ఏర్పాటు చేయాలి" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Latest News