|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:51 PM
మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ట్విస్టులతో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఈ కేసు ఆధారంగా ఓ చిత్రం రాబోతోందని సమాచారం. విభిన్న కథలతో సరికొత్త చిత్రాలను అందించే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఈ హత్య కేసుతో క్రైమ్ థ్రిల్లర్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మిస్టరీ, భావోద్వేగాలు ఆమిర్‌ను విపరీతంగా ఆకర్షించాయని సమాచారం. కథ ప్రకారం, రాజా రఘువంశీ అనే వ్యక్తి హనీమూన్‌కు వెళ్లగా అక్కడ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. మర్డర్ వెనుక అతడి భార్య సోనమ్ పాత్రపై అనేక అనుమానాలు కలుగుతాయి. ఈ మిస్టరీని స్క్రీన్‌పై ఆసక్తికరంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఆమిర్ ఉన్నట్లు తెలుస్తోంది.
Latest News