|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:48 PM
సినీ నటుడు మోహన్‌బాబు తన ఆత్మీయ స్నేహితుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఉన్న 50 ఏళ్లకు పైగా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, ఐదు దశాబ్దాలకు పైగా తమ మధ్య గాఢమైన స్నేహం కొనసాగుతోందని మోహన్‌బాబు తెలిపారు."మేమిద్దరం మద్రాస్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై మొదటిసారి కలిసినప్పుడు మా వద్ద లేమీ లేదు... అప్పటికి మేం నటులం కూడా కాదు. ఇప్పుడు కూడా మా స్నేహం అలాగే కొనసాగుతోంది. నేను రజనీని 'హే బ్లడీ తలైవా' అని ముద్దుగా పిలుస్తాను. మేము రోజూ 3-4 సందేశాలు పంపించుకుంటాం" అని చెప్పారు. రజనీకాంత్ తనకు కోపాన్ని అదుపు చేసుకోవడానికి ఇచ్చిన సలహాను కూడా మోహన్‌బాబు గుర్తు చేసుకున్నారు. "పుస్తకాలు చదవడం కాదు, వాటిని అనుసరించి కోపాన్ని వదిలేయ్" అని రజనీ సూచించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన కుమారుడు విష్ణు మంచు నటించిన 'కన్నప్ప' చిత్రాన్ని రజనీకాంత్ చూసి, అభినందించిన సంగతిని కూడా మోహన్ బాబు ప్రస్తావించారు.
Latest News