|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:52 AM
సమంత టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్. అగ్ర హీరోలు అందరితోనూ నటించి హిట్స్ అందుకుంది. నటిగా నిరూపించుకుకోవడమే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ ఫుల్ అనిపించుకునే ప్రయత్నాల్లో ఉంది. మయోసైటీస్‌లో బాధపడుతున్న సమయంలో తనకొచ్చిన ఆలోచిన నిర్మాణ సంస్థను ప్రారంభించడం. కథానాయికగా కెరీర్ ఇక ముందుకు సాగకపోవచ్చు అని ఆమెకు అనిపించిన తరుణంలో వచ్చిన ఆలోచనే నిర్మాణరంగంలో అడుగుపెట్టడం. అలా పుట్టుకొచ్చిందే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ సంస్థ. ఆ బ్యానర్‌లో ఇప్పటికే ‘శుభం’ చిత్రాన్ని తీసి సక్సెస్ అనిపించుకున్నారు. అలాగే మా ఇంటి బంగారం చిత్రాన్ని కూడా ప్రారంభించారు.ఇప్పుడు సమంత అటు నటనకు, ఇటు నిర్మాణ రంగానికి సమాన ప్రాధాన్యత ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం సమంత నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకురాలు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్ట్‌లతో బిజీగా సామ్ ఈ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించాలనే ఉద్దేశంతో ఉందట. గతంలో సామ్, నందినీరెడ్డి కాంబోలో ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ సినిమాలు వచ్చాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఇదో మూడో సినిమా అవుతుంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ కాంబో ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!
Latest News