|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:51 AM
‘ఒక మంచి సినిమాను తీయడం దాన్ని ప్రేక్షకుల చెంతకు చేర్చడం చాలా కష్టం. ఎన్నో అడ్డంకులను అధిగమించి ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. ప్రేక్షకాధరణ ఆనందాన్నిస్తోంది. మానవ సంబంధాల్ని చక్కగా చూపించారు అని అందరూ ప్రశంసిస్తున్నారు’ అని దర్శకురాలు ప్రవీణ పరుచూరి చెప్పారు. మనోజ్ చంద్ర, మోనిక హీరో హీరోయిన్లుగా ప్రవీణ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. మనోజ్ చంద్ర మాట్లాడుతూ ‘పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతున్నారు. రామకృష్ణ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయిన విధానం, సినిమాను ఆస్వాదిస్తున్న తీరు ఆనందాన్నిస్తోంది. నా సినీ గమనాన్నే మార్చిన పాత్ర చేశాను. మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే కోరిక నెరవేరింది’ అని అన్నారు. మనుషుల విలువల్ని, వారి మధ్య ఉండే భావోద్వేగాల్ని దర్శకురాలు తెరపై ఎంతో సహజంగా చూపించారు కాబట్టే సినిమా విజయవంతమైంది అని నిర్మాతలు పేర్కొన్నారు.
Latest News