|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 04:06 PM
సీనియర్ నటి సురేఖా వాణి టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అక్కగా, అత్తగా, చెల్లిగా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె హీరోయిన్ అంత ఫేమ్ రాబట్టుకుంది. కానీ కరోనా తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక తన కూతురితో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ రీల్స్ చేస్తోంది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇక ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన సుప్రీత పలు షోస్‌లోనూ పాల్గొని సందడి చేసింది. త్వరలోనే వెండితెరపై కూడా అలరించడానికి రాబోతుంది. బిగ్‌బాస్ సీజన్-7 అమర్దీప్ చౌదరితో కలిసి 'చౌదరి గారి అబ్బాయి, నాయుడు గారి అమ్మాయి'(Chowdary Gari Abbayi Tho Naidu Gari Ammayi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది.ఇదిలా ఉంటే.. తాజాగా, సుప్రీత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన తల్లితో కలిసి శివుడికి ప్రత్యేక పూజలు చేసింది. కట్టు బొట్టుతో సంప్రదాయంగా కనిపిస్తూ చీరకట్టులో అలరిస్తోంది. పండితుల సమక్షంలో పరమశివుడి లింగానికి భక్తితో అభిషేకం చేసింది. అంతేకాకకుండా తలలో మల్లెపూలు పెట్టుకుని దేవుడికి హారతి ఇస్తూ పూజారులతో కలిసి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించింది. ఇక ఈ పోస్ట్‌కు ''నేను నా శివయ్యా'' అనే క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదంతా పెళ్లి కోసమా.. లేక సినిమా హిట్ అవ్వాలనా అంతగానం పూజలు చేసేది అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.