|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 03:49 PM
తెలుగు సినిమా ప్రపంచంలో సౌందర్య ఒక మణిదీపం. ఆమె అందం, అభినయం, మంచి మనసు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అమ్మోరు, పెదరాయుడు, అంతఃపురం వంటి చిత్రాల్లో కుటుంబ విలువలు, సాంప్రదాయం ప్రతిబింబించే పాత్రలతో 'తెలుగింటి ఆడపడుచు'గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి ఏడాది జులై 18న సౌందర్య జయంతిగా అభిమానులు ఆమెను ఘనంగా స్మరిస్తుంటారు.సౌందర్య తన సినీ జీవితంలో అనేక అవార్డులు అందుకున్నారు. ఆమె ఏడు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక జాతీయ చలనచిత్ర అవార్డు (స్పెషల్ జ్యూరీ) సొంతం చేసుకున్నారు. తెలుగులో అంతఃపురం, పవిత్ర బంధం, అమ్మోరు వంటి సినిమాలకు ఆమె నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆమెను "తెలుగు సినిమా సౌందర్యం" అని అభిమానం, గౌరవంతో పిలిచేవారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
Latest News