|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 01:56 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క పాన్-ఇంటర్నేషనల్ జంగిల్ అడ్వెంచర్ తాత్కాలికంగా 'SSMB29' పేరుతో రానుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇండో-హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. దర్శకుడు రాజమౌళి ఈ సినిమా షెడ్యూల్ ని సెరెంగేటిలో షూట్ చేయనున్నారు. SSMB29 బృందం దక్షిణాఫ్రికాకు వెళ్ళే ముందు లొకేషన్ స్కౌటింగ్ కోసం జూలై మూడవ వారంలో టాంజానియా కి వెళ్లనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయి. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవా కట్ట డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.
Latest News