|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 08:19 AM
జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' చిత్రం అక్టోబర్ 10, 2024న తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సూపర్ కాప్ థ్రిల్లర్ లో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జెమినీ మూవీస్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జెమినీ మూవీస్ ఛానల్ లో జులై 19న రాత్రి 7 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్, కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
Latest News