![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 06:23 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'కూలీ' కోసం సంచలనాత్మక దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేతులు కలిపారు. ఈ బిగ్-టికెట్ ఎంటర్టైనర్ ఆగష్టు 14, 2025న విడుదల కానుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు సాంగ్ స్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని థర్డ్ సింగల్ ని జులై 22న రాత్రి 9:30 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రుతి హాసన్ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. నాగార్జున, ఉపేంద్ర, మరియు సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించగా, అమీర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News