![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 04:18 PM
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహానటి మూవీతో ఈ అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అందం అభినయంతో ఎంతో మంది మదిని దోచేసి, ఈ తరం మహానటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా, మల్టీ కలర్ డ్రెస్‌లో అభిమానులను ఆకట్టుకుంది.బ్యూటీ కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని నేను శైలజా తో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ తో మంచి ఫేమ్ సంపాదించుకొని, అనతికాలంలోనే ఈ ముద్దుగుమ్మ స్టార్ నటిగా తన సత్తా చాటుకుంది. వరసగా స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ బ్యూటీ తెలుగులో అగ్రహీరోలందరి ల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్న విషయ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ చెక్కేసి, అక్కడ వరసగా లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. బేబీజాన్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ, బాలీవుడ్ లోనే మరో ప్రాజెక్ట్ కూడా సైన్ చేసినట్లు తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని థట్టిల్ ను డిసెంబర్ 12,2024లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ మరింత పెంచిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య ఈ అమ్మడు తన అంద చందాలతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ మల్టీ కలర్ ఫ్రాక్‌లో తన అభిమానుల ముందుకు వచ్చింది. ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంతలా తన అంద చందాలతో మాయ చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ బ్యూటీ ధరించిన ఫ్రాక్ వివిధ రంగులతో ఉండటంతో, ఈ ఫొటోస్ చూసిన ఈ బ్యూటీ అభిమానులు ఏంటీ కీర్తి.. ఈ అతుకుల డ్రెస్ ఎక్కడ కుట్టించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో, పాత ట్రెండ్ గుర్తు చేశావంటూ కీర్తిని పొగిడేస్తున్నారు. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి
Latest News