
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 03:16 PM
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరధా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాపై టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా మూవీ మేకర్స్ బాలకంపేట్ ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి అశీసులు తీసుకున్నారు. ఈ సందర్శనకు సంబందించిన చిత్రాలని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో అనుపమతో కలిసి దర్శన రాజేంద్రన్, సంగీత క్రిష్ మరియు రాగ్ మయూర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పి, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. తెలుగు, మలయాళం రెండు భాషల్లోనూ ఈ సినిమా ఆగష్టు 22న విడుదలకు సిద్ధంగా ఉంది.
Latest News