![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 08:49 AM
టాలీవుడ్ నటుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబుతో కలిసి "ఆంధ్ర కింగ్ తాలూకా" చిత్రం కోసం పని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క టైటిల్ గ్లింప్స్ కి భారీ స్పందన లభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నటుడు ఒక సూపర్ స్టార్ యొక్క డై-హార్డ్ అభిమానిగా కనిపించనున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని నువ్వుంటే చాలు అనే టైటిల్ తో విడుదల చేసారు. ఫుల్ సాంగ్ ని జులై 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వివేక్ మరియు మార్విన్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి రామ్ లిరిక్స్ అందించగా, అనిరుద్ తన గాత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనుండగా, భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రామ్ రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతరలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీత ద్వయం వివేక్ మార్విన్ సౌండ్‌ట్రాక్ అందిస్తున్నారు.
Latest News