|
|
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 07:32 PM
పోలీస్ కథలను తెరకెక్కించడంలో మలయాళం దర్శకులకు మంచి నైపుణ్యం ఉంది. ఈ జోనర్ నుంచి మలయాళం సినిమా వస్తుందంటే, ఇతర భాషల ప్రేక్షకులు సైతం కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రానుంది ఆ సినిమా పేరే 'అస్త్ర'. అమిత్ చకలకల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ఆజాద్ అలవిల్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా 2023 డిసెంబర్లోనే థియేటర్లకు వచ్చింది. కొన్ని కారణాల వలన వెంటనే ఓటీటీకి రాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా 'మనోరమా మ్యాక్స్' ద్వారా స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కళాభవన్ షాజోన్ .. సెంథిల్ కృష్ణ .. సుహాసిని కుమరన్ .. శ్రీకాంత్ మురళి ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కథ విషయానికి వస్తే .. కేరళలోని వయనాడ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ ను టార్గెట్ గా చేసుకుని అక్కడ హత్యలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న దారుణాలకు కారకుడైన వాటిని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. హంతకుడు ఎవరు అతనిని పట్టుకోవడానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడు అనేది కథ. థియేటర్స్ వైపు నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎంతలా మెప్పిస్తుందనేది చూడాలి
.
Latest News