![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 07:54 AM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న రాబోయే ఎంటర్‌టైనర్ 'ది గర్ల్‌ఫ్రెండ్' లో కనిపించనుంది. ఇప్పుడు అందరి అందరి దృష్టి ఈ చిత్రం పై ఉంది. ది గర్ల్‌ఫ్రెండ్ కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు మరియు పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా గ్రాండ్ రిలీజ్ కోసం రేసులో ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని నాదివే అనే టైటిల్ తో విడుదల చేసారు. ఫుల్ సాంగ్ ని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రతిభావంతులైన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
Latest News