|
|
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 03:17 PM
విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత తమిస్హ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ తన 29వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'మార్షల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో కార్తీకి జోడిగా కళ్యాణి ప్రియదర్శిని నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క స్నిక్ పీక్ వీడియోని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో వడివేలు, మురళి శర్మ, సత్య రాజ్, ప్రభు, జాన్, ఈశ్వరి రావు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. సాయి అభ్యంకర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News