![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 15, 2025, 07:21 AM
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం యొక్క "క" చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. దీపావళి ట్రీట్‌గా అక్టోబర్ 31న విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌తో కిరణ్ తన విలువను నిరూపించుకున్నాడు గ్రామీణ నేపథ్యంతో రూపొందించబడిన ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ తెలుగు సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం జులై 15న ఉదయం 9 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. సుజిత్, సందీప్ దర్శకత్వం వహించిన "క" ఒక ప్రత్యేకమైన పీరియాడికల్ థ్రిల్లర్. ఈ చిత్రంలో తన్వి రామ్ మరియు నయన్ సారిక మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్లీ, శరణ్య, అన్నపూర్ణ, అజయ్ మరియు బలగం జయరామ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో రూపొందింది. ఎడిటర్ శ్రీ వరప్రసాద్, సినిమాటోగ్రాఫర్లు విశ్వాస్ డేనియల్ మరియు సతీష్ రెడ్డితో సహా సాంకేతిక బృందం ఉంది. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.
Latest News