![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 12:41 PM
ప్రముఖ సీనియర్ నటి సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌లతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి హిట్ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు.
Latest News