![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 02:57 PM
జూరాల ప్రాజెక్టును డేంజర్‌లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే.. HYDకి మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరమని KTR అన్నారు. సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్లే వరుసగా ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని మండిపడ్డారు. SDSO నిపుణుల బృందం గత మార్చి 22న బ్యారేజీని సందర్శించి సమర్పించిన నివేదికను ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కనపెట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.