![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 10:36 AM
ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది.దీని ప్రభావంతో రాగల రెండు రోజులు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు, రేపు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఈ రోజు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే నేడు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది