![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:04 PM
ఖమ్మం ఆర్టీసీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందాడు. ఆర్టీసీ కాలనీకి చెందిన ఆర్ శ్రీనివాసరావు (54) బుధవారం ఉదయం రైలులో మధిరకు వెళ్తున్న సమయంలో ఛాతి నొప్పికి గురై చింతకాని స్టేషన్‌లో దిగి ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ గుండె నొప్పి ఎక్కువగా రావడంతో మరణించాడు. సమాచారం మేరకు ఎస్ఐ నాగుల్ మీరా తన సిబ్బందితో మృతదేహాన్ని పరిశీలించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.