![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:08 PM
ఎల్లారెడ్డికి చెందిన నవీడ్ పర్వేజ్ కు కోర్టులో ప్రభుత్వ కేసుల వాదన కోసం ఏజీపీగ నియామకం చేయడంలో సహకరించి, కృషి చేసిన జహిరాబాద్ ఎంపి సురేష్ కుమార్ శెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులకు ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం నవీద్ కు ముస్లిం వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. 3 ఏళ్ళ ఈ పదవి కాలంలో మంచి పేరు సాధించాలని ముస్లిం పెద్దలు కోరారు.