![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:26 PM
తెలంగాణ నార్కోటిక్ విభాగం 'ఈగల్ టీం' బుధవారం భారీ డ్రగ్ రాకెట్‌ను బట్టబయలు చేసింది. హైదరాబాద్ కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. రెస్టారెంట్ యజమాని సూర్య, పలు పబ్ యజమానులు, 23 మంది పారిశ్రామికవేత్తల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. నైజీరియన్ల ద్వారా లేడీస్ హైహీల్స్ చెప్పుల్లో డ్రగ్స్ పెట్టి హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు.