![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 07:01 PM
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.జహీరాబాద్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి. హైదరాబాద్-బెంగళూరు ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని కోరిన రేవంత్ రెడ్డి. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు